Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుగ్గొండి
రైతులు తాము పండించే పంటలు నేరుగా అమ్మితే వచ్చే లాభం కన్నా పుడ్ ప్రాసెస్ చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తిమ్మంపేటలో గురువారం చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మిర్చి పంట విషయంలో రైతులు మెలకువలు పాటించడంతో పాటుగా వ్యవసాయ, హార్టికల్చర్ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పంటను చంటి పిల్లలను కాపాడినట్లు కాపాడితేనే రైతులకు పంట చేతికి వస్తోందన్నారు. పండించిన పంటకు మద్దతు ధర లేకుంటే నిల్వ ఉంచేందుకు అవసరమయ్యే కోల్డ్ స్టోరేజ్ క్లస్టర్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు ఆయన పేర్నొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యాభై గ్రామాల్లో రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటై వ్యాపారం నిర్వహిస్తూ అధిక లాభాలు గడిస్తున్నాయన్నారు. నా బార్డ్ తో సహా అనేక గుర్తింపు పొందిన బ్యాంకులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి సుముఖంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో అనేక రైతు ఉత్పత్తి దారులు సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆర్థిక అభివద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస రావు, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, వైస్ ఎంపీపీ జైపాల్ రెడ్డి, వ్యవసాయాధికారి దయాకర్, రైతు సమన్వయ సమితి సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
మండలంలోని మహమ్మదాపురంలో ఇటీవల మృతిచెందిన టీఆర్ఎస్ నాయకుకలు చింత కుమారస్వామి, వార్డు మెంబర్ పాసికంటి శంకర్లు కుటుంబాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్, నాయకులు రవి, శివ, స్వామికార్యకర్తలు పాల్గొన్నారు.