Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి
- పెట్రోల్ పంప్ ఎదుట నిరసన
నవతెలంగాణ-న్యూశాయంపేట
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ పార్టీ జిలా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బస్ డిపో వద్ద ఉన్న పెట్రోల్ పంప్ ఎదుట గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం దేశంలో తగ్గించకపోతే ఏరోజుకారోజే పెంచుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరుగుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంటోందని ఆందోళన వెలిబుచ్చారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా పన్నులు తగ్గించి ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ధరలను ఇష్టారీతిన పెంచుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రజలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చేలా తప్పుడు విధానాలు అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి సమరశీల పోరాటాలు నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కయ్య, ఉప్పలయ్య, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్, సింగారపు బాబు, జిల్లా నాయకులు ధరావత్ భానూనాయక్, రోజా, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
దిగజారిపోతున్న జీవన స్థితిగతులు
మహబూబాబాద్ : బీజేపీ పాలనలో ప్రజల జీవన స్థితిగతులు దిగజారి పోయాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహా య కార్యదర్శి అజరు, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి లింగ అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆ పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలో మోడీ సర్కార్ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సూర్నపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, సీపీఐ నాయకులు పెరుగు కుమార్, ఆర్పల్లి నవీన్, కోటేష్, ఐలయ్య, చింతకుంట్ల వెంకన్న, నర్రా శ్రావణ్, తోట విజరు, శ్రావణ్, పాల్గొన్నారు.
ములుగు : జిల్లా కేంద్రంలోని పెట్రోల్ పంపుల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజద్ పాషా మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు బోడ రమేష్, కొర్ర రాజు, మట్టివాడ పెద్ద రాజయ్య, సమ్మయ్య, బత్తిని రాజు, ఇంజం కొమురయ్య, తనుగుల రాజు, ఒజ్జ రాజు, రాజయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండలంలోని పస్రా గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పులగుజ్జు వెంకన్న, నాయకులు పొదిళ్ల చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి, గుండు రామస్వామి, గొంది రాజేష్, అంబాల మురళీ, పోశాలు, బద్ధం మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ ఎదుట వామ పక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్య దర్శి విజయసారథి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొబ్బాల యాకూబ్‌రెడ్డి, ఎంసీ పీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచె వెంకన్న, న్యూడెమోక్రసీ నాయకుడు కన్మంతరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనసూర్య మాట్లా డారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చొప్పరి శేఖర్, మంద భాస్కర్, సామ సారయ్య, కాసు సాయిచరణ్, బండారు వెంకన్న, శ్రీను, ఎంసీపీఐ(యూ) నాయ కులు మర్రిపెల్లి మొగిలి, బుచ్చానాయక్, వెన్ను ఎల్లయ్య, వెంకన్న పాల్గొన్నారు.
వాజేడు : మండలంలోని గుమ్మడిదొడ్డి గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దబ్బకట్ల లక్ష్మయ్య మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గుగ్గిళ్ళ దేవయ్య, బచ్చల కష్ణ బాబు, పూనెం అనిల్ కుమార్, పూనెం సందీప్, తలండి సందీప్, పూనెం మునిందర్, పూనెం ప్రభాకర్, మొడెం గోపీ, ఆలం అక్షిత్, మడె వేణుబాబు, యాలం సుందరయ్య, కారం అరుణ, కారం నవీన్, యాలం సందీప్, తదితరులు పాల్గొన్నారు.