Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలకతీతంగా సంక్షేమ పథకాల అమలు
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-తరిగొప్పుల
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో 16 మంది లబ్దిదారులకు ఎంపీపీ జొన్నగోని హరిత సుదర్శన్‌గౌడ్, జెడ్పీటీసీ ముద్దసాని పద్మజా వెంకట్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గురువారం కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేలా పలు పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. అనంతరం బుడగజంగాల కాలనీలో మురుగునీటి కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభుదాస్, వైస్ ఎంపీపీ ప్రమీల, ఎంపీటీసీలు మధుసూదన్‌రెడ్డి, జూమ్లాల్ నాయక్, తహసీల్దార్ ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సుధీర్, నాయకులు లింగం, పోచయ్య, భీమయ్య, సారయ్య, రాజేశ్వర్‌రావు, వెంకటేష్, రవీంద్రచారి, జయపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.