Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్
- సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. కేసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మండలానికి చెందిన 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు బుధవారం అందిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
రైతులకు సన్మానం
ఏరువాక పౌర్ణమి సందర్భంగా అభ్యుదయ రైతు సంఘ భవనంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ రైతులను శాలువాలతో సన్మానించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి సబ్సిడీ మీద పీఆర్జీ-176 కంది రకం, ఎల్‌ఆర్‌జీ-52 లాం ఫామ్ సరుకులను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏఓ ఛత్రునాయక్, డీహెచ్ఎస్ఓ సూర్యనారాయణ, మండల పరిషత్ చైర్మెన్ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, మండల పరిషత్ వైస్ చైర్మెన్ నవీన్‌రెడ్డి, ఏఓ బానోత్ వెంకన్న, అభ్యుదయ జై కిసాన్ కష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నివాళ్లు
మండలంలోని బ్రహ్మంగారి తండాకు చెందిన బానోత్ మారున్ అనారోగ్యంతో మృతి చెందగా అతడి మృతదేహానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, నాయకులు నారాయణరావు, దామరకొండ ప్రవీణ్, నజీర్ అహ్మద్, బట్టు శ్రీను, కముటం శ్రీను, వీరూనాయక్, తదితరులు పాల్గొన్నారు.