Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 ఏండ్లుగా అడవిలోనే జీవితం
- స్వగ్రామంలో విషాదఛాయలు
నవతెలంగాణ-తాడ్వాయి
సిద్ధబోయిన సారక్క అలియాస్ భారతక్క ప్రస్థానం ముగిసింది. 36 ఏండ్లుగా ఆమె అడవిలోనే విప్లవ జీవితం గడిపారు. ఈనెల 21న ఆమె మృతి చెందడంతో ఆమె స్వగ్రామ మైన తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో గురువారం విషాదఛాయలు నెల కొన్నాయి. సిద్దబోయిన పాపయ్య-ఎర్రమ్మ దంపతులకు జన్మించిన సారక్క ప్రాథ మిక విద్యను మాత్రమే అభ్యసించింది. పార్టీలోనే ఆమె ఉన్నత విద్యను అభ్య సించింది. జైలు జీవితంలోనే డిగ్రీ పూర్తి చేసింది. 1985లో ఏటూరునాగారంలో దళంలో చేరి ఆమె ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1986లో అరెస్టై రెండేండ్లు జైలు జీవితం గడిపింది. 1989లో ఆమె సహచరుడు కోటి హన్మన్న మృతి చెందగా అదే ఏడాది ఆమెకు కొడుకు అభిలాష్ కలిగాడు. తన కుమారుడిని సైతం ఆమె అడవి బాట పట్టించింది. 2020 భారతక్క కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయాడు. 2021లో ఆమె భర్త మోహన్‌రావు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన చనిపోయిన 12 రోజుల వ్యవధిలోనే భారతక్క తుదిశ్వాస విడిచింది. ఆమె 36 ఏండ్ల విప్లవ జీవితంలో అనేక నిర్భంధాలను తట్టుకొంది.
1992లో దళంలో చేరిక
సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క 1992లో ఏటూర్‌నాగారం దళంలో చేరింది. కొద్దికాలం కత్తి మోహన్రావుతోపాటు ప్రెస్ విభాగంలో పని చేసింది. 2001లో గుండాల ఎల్డీఎస్ కమాండర్, ఆర్గనైజర్‌గా పని చేసింది. 2002లో రెండోసారి అరెస్టైంది. 2005లో జైలు నుంచి బయటకొచ్చాక దళంలో బాధ్యతలు చేపట్టింది. 2008లో దండకారణ్యానికి బదిలీ అయి మాడ్ డివిజన్లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్ పాఠశాలకు ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తింయింది,
స్వగ్రామంలో విషాదఛాయలు
సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క మరణ వార్త తెలిసి కాల్వపల్లి జనం కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సారక్క ఏ రోజూ స్వార్ధం గురించి ఆలోచించలేదని, విప్లవమే ఊపిరిగా ముందుకు సాగిందని ప్రజలు గుర్తు చేసుకున్నారు.