Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ-కురవి
పల్లె ప్రకృతి వనాలను ప్రజలు సందర్శిం చేలా అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. గురువారం మండల పరిధి పలు గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా నారాయణపురం పల్లె ప్రకృతి వనం సందర్శించి వాకింగ్ ట్రాక్ నిర్వహణ చేపట్టాలన్నారు. నర్సరీని సందర్శించి పర్యవేక్షణ కొరవడిందని సర్పంచ్ విజయవాసురాజును మందలించారు. అనంతరం పెద్దతండ పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని సందర్శించి వాకింగ్ ట్రాక్ చేపట్టాలని, నర్సరీలో రాబోయే కాలానికి అవసరమయ్యే మొక్కల్ని సిద్ధం చేసుకోవాలన్నారు. నర్సరీల నిర్వహణకు వనసేవకుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆక్రమణకు గురవుతున్న స్థలాలకు ఫెన్సింగ్ చేపట్టాలన్నారు. మురుగు నీటి నిలువ ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వేయాల న్నారు. పారిశుద్ధ్యం పనులు, ఫాగింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం తాట్యా తండ పల్లె ప్రకృతి వనం పార్క్ ను, నర్సరీని కలెక్టర్ సందర్శించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ అధికారులు సందర్శించి నర్సరీలపై అవగాహన పెంచాలన్నారు. అధిక మొత్తంలో నర్సరీలలో టేకు మొక్కలు పెంచాలన్నారు. ఎంపీడీవో ధన్సింగ్, తాసిల్దార్ విజరుకుమార్, ఎంపీఓ వెంకటరమణ, అటవీశాఖ అధికారి శ్రీనివాస్, ఏపీఓ ఏకాంబరం, నారాయణపురం పెద్దతండ సర్పంచులు విజయ వాసు రాజు, వనజ శ్రీ రామ్, పంచాయతీ సెక్రటరీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.