Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యేడాదిలోపు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి..
- బోటింగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
మాధన్నపేట పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదపరుస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం మాధన్నపేట పెద్ద చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భంచాక నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ధృడమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరందించే కల త్వరలోనే నెరవేరబోతుందని, ఇందుకోసం గోదావరి జలాలు రంగయ్య చెరువు, పాకాల, మాధన్నపేటలోకి తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. చారిత్రక మాధన్నపేట పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యం కొంత మేరకు ఆలస్యమైందనీ కారణాల జోలికి పోకుండా యేడాదిలోపు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే మిగిలిపోయిన పనులకు రూ.4కోట్ల అంచనా రూపొందించామని తెలిపారు. పర్యాటక కేంద్రం అవశ్యకతపై తాను అసెంబ్లీలో ప్రస్తావించగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌ను కోరగా సానుకూలంగా స్పందించి బోట్లను కేటాయించారన్నారు. తెలంగాణ వచ్చాక పాకాల పర్యాటక కేంద్రంగా పునర్వైభవం చెందిందని, అదే తీరులో మాధన్నపేట చెరువును కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిద్దుతామన్నారు. పట్టణ సమీపంలో ఉన్నందున పర్యాటకులకు మరింత దగ్గరిలో ఆహ్లాదం పంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే చెరువు ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. నర్సంపేట పట్టణాభివృద్ధికై మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చి నిధులను మంజూరు చేసి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్, వైస్ చైర్మన్ రాయిడి రవీందర్ రెడ్డి, ఎంపీపీ మోతె కలమ్మ, మాధన్నపేట సర్పంచ్ చంద్రమౌళి, వార్డు కౌన్సిలర్ జుర్రు రాజు యదవ్, కమిషనర్ విద్యాధర్, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు రాయిడి రవీందర్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పర్యాటక సంస్థ సూపర్వైజర్ గణేష్ తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.