Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న మోడీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భూస్థాపితం కాకతప్పదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, రైతు సంఘం కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి, సీఐటీయు జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి అన్నారు. శనివారం వ్యకాస, రైతు సంఘం, సీఐటీయు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చడానికి మూడు రైతు చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి రైతాంగాన్ని కాపాడాలని లేకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో రైతులు భూస్థాపితం చేయకతప్పరని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు పర్చాలని ఏడు నెలల నుంచి ఢిల్లీ పురవీధుల్లో రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోగా నియంతత్వ వైఖరికి అవలంభించడం నాటి ఎమర్జెన్సీ తలపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న మేధావులపై తీవ్ర నిర్భంధాన్ని అవలంభిస్తూ దేశ ద్రోహం కేసులను విధించడం అన్యాయమన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు ఏకమై పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి ఆంజనేయులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యారా ప్రశాంత్, సీఐటీయు జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా, రుద్రారం లక్ష్మీ, ఓడపెల్ల్లి ప్రవీణ్, పొన్నాల తరుణ్ పాల్గొన్నారు.
న్యూశాయంపేట: దేశానికి అన్నం పెట్టే రైతన్నల నడ్డివిరిచే మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల సారంగపాణి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఇందిరా గాంధీసెంటర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు బిల్లులను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటను ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షులు వేల్పుల సాంబమూర్తి, ప్రజా సంఘాల నాయకులు, కే. కష్ణ, ఎ కిరణ్, ఎ కన్నయ్య, పి. రమేష్, రవి, సతీష్, రాజు, అనిల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
కాళోజి సెంటర్లో..
హన్మకొండ కాళోజీ సెంటర్లో శనివారం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ నాయకులు మంద సంపత్, ప్రజాసంఘాల నాయకులు రాజేందర్, వెంటేశ్వర్లు, బొల్లారం సంపత్, నోముల కిషోర్, బొచ్చు నాగరాజు, పల్లా కొండ శ్రీకాంత్, ఒంటేరు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) జనశక్తి సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఎస్బీహెచ్ పెట్రోల్ బంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్ర మంలో నాయకులు రాచర్ల బాలరాజు, బండి కోటేశ్వరరావు, విజరు ఖన్నా , సంపత్, ఐలయ్య, హరిబాబు, ఇనుముల కష,్ణ రాతి పెళ్లి కష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తీసుకువచ్చిన వ్యవసాయ సాగు చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్ రావు డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం వరంగల్ లోని అబ్బనికుంటలోని రైతు భవన్ ఎదుట వ్యవసాయ సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. ఈసందర్భంగా చందర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నాన్ని మానుకోవాలన్నారు.
హసన్‌పర్తి: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని స్థానిక తహశీల్ ఎదుట సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు, సీఐటీయూ మండల కార్యదర్శి పుల్ల అశోక్, రమేష్, పుల్ల పావని, అనిత పాల్గొన్నారు.
సంగెం: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి వ్యవసాయదారులకు కనీస మద్దతు ధర కల్పించాలని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో తహశీల్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ విశ్వనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోనే రాంచందర్ ఎండీ ఇస్మాయిల్, శివకుమార్, యాకూబ్‌నాయక్, శివారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఎంసీపీఐ(యూ), ఏఐకేఎఫ్ల ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం తహశీల్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రూరల్ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, డివిజన్ కార్యదర్శి మండ రవి, మండల నాయకులు గుగులోతు అరుణ్ నాయక్, కాయిత వెంకన్న, సుల్తాన్ సారయ్య, తాడికొండ రంగారావు, గుగులోత్ లకపతి, వీరన్న, కోటి నాయక్, రాము నాయక్, వాసునాయక్, భూక్యా బాలరాజు, మాన్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.