Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మండలం అటవీ గ్రామాల్లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. శనివారం భూపాలపల్లి మండలంలోని పంబాపూర్ గ్రామ శివారు రాజీవ్‌నగర్ గ్రామంలో సర్పంచ్ బంటు అనూషరమేష్ ఆధ్వర్యంలో భూలక్ష్మి, మా లక్ష్మి పోతురాజు విగ్రహాల ప్రతిష్ట చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం వేద పండితులు గోవర్ధన శర్మ, రఘు శర్మను ఎమ్మెల్యే సత్కరించారు. రాజీవ్ నగర్లో బొడ్రాయి ప్రతిష్టాపనకు హాజరైన ఎమ్మెల్యేకు ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
సీఎంతో మాట్లాడతా
మండలంలోని పంబాపూర్ గ్రామ శివారు రాజీవ్‌నగర్ గ్రామంలో గ్రామ స్థాపనకు కృషి చేసిన సోంపల్లి ఎల్లారంతో కలిసి ఎమ్మెల్యే గండ్ర బొడ్రాయి ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పోడు భూములకు పట్టాలివ్వాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ.. పోడు సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని హామీనిచ్చారు. అటవీ గ్రామాల్లోని రైతులు కొత్తగా ఫారెస్ట్ భూముల్లోకి వెళ్లి పోడు చేయొద్దన్నారు. గతంలో పోటీ చేసిన భూమికి పట్టాలిచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, జంగేడు పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్‌యాదవ్, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ మండల విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మండల రవీందర్ రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు బుర్ర రమేష్‌గౌడ్ భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి సిద్ధూ, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, గొల్ల బుద్ధారం నాగారం, ఆజంనగర్ గ్రామాల ఎంపీటీసీలు బొడ్డు సమ్మయ్య,బ వినోద, సునిత శ్రీనివాసరెడ్డి, అటవీ గ్రామాల సర్పంచులు పిన్ రెడ్డి రాజి రెడ్డి, పక్కల మాధవి సమ్మయ్య, బంటు అనూష, రమేష్ భూతం సురేష్, తదితరులు పాల్గొన్నారు.