Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ప్రజలకు సేవ చేయడంలో ప్రజల గౌరవాన్ని పొందేకంటే అంతకన్నా గొప్ప ప్రోటోకాల్ మరొకటి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభివర్ణించారు. శనివారం మండలంలోని రైతు సమన్వయ కమిటీ నాయకులు చింతకుంట్ల నరేందర్ స్వగహంలో నియోజకవర్గ పరిధి ఏడు మండలా లకు గానూ 55 మంది లబ్ధిదారులకు రూ.19లక్షల విలువైన సీఎంఆర్ ఎఫ్ సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం కడియం శ్రీహరి మట్లా డుతూ.... ప్రమాద సమయాల్లో నిరుపేద కుటుంబా లకు ఆసరాగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన నిమిత్తం నూతన కలెక్టరేట్, ఇతర అభివద్ధి పనుల ప్రారంభానికి 2017లో ఇచ్చిన హామీ మేరకు అధునాతన హంగు లతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం హర్షణీయమని అన్నారు. రైతుబంధు, బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. జనగామ జిల్లాల్లోని చేర్యాల, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ చిల్పూర్, కొడకండ్ల, తదితర ప్రాంతాల్లో దేవాదుల ద్వారా సాగునీరందించాలని కోరినట్లు తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ ముందుచూపులో భాగంగా రెండు పంటలు గణనీయంగా సాగు విస్తీర్ణం పెరగడమే గాకుండా, ధాన్యం దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఇంతటి అభివద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు తప్పు పట్టడంపై వారికి నైతిక హక్కు లేదని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా, వర్ధన్నపేట, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, చిల్పూర్, తదితర మండల ప్రాంతాల్లో సాగునీటి వనరుల విషయంలో సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయమందించేందుకు వెనుకా డబోనని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రోటోకాల్ అవసరమే లేదని, ప్రజల ప్రేమాభి మానాలు ఉంటే చాలని అన్నారు. ప్రజాభివద్ధిలో సహకారాన్ని అందించాలే తప్ప రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్స్ గౌరవ అధ్యక్షుడు బెలిదే వెంకన్న, మాజీ జడ్పీటీసీ మారుజోడు రాంబాబు, సర్పంచ్ పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, బూర్ల శంకర్, అన్నం బ్రహ్మ రెడ్డి, రాజేష్ నాయక్, ఎంపీటీసీ రజాక్ యాదవ్,ఆకుల నర్సన్న, పులి యాకయ్య, పల్లె రవీందర్, కడియం యువసేన ప్రతినిధులు నాగరాజు, దేవేందర్, గట్టయ్య, రాజు పాల్గొన్నారు.
సీఎం సహయనిధి చెక్కులు పంపిణీ
లింగాలఘనపురం : మండలం లోని కళ్లెం గ్రామ నివాసి నక్కీర్త నర్సయ్యకు రూ.46వేలు, మాణిక్యపురం గ్రామ నివాసి నర్రా ఉపేందర్ రెడ్డికి రూ.56వేల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శనివారం అందజేశారు. కళ్లెం మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్యపురం మాజీ సర్పంచ్ చౌదరపల్లి విజరుభాస్కర్, రాగం కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.