Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా రూపొందించిన ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం జీడబ్య్లూఎంసీ కార్యాలయంలో మలేరియా విభాగ అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్నిన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా, ప్రబలకుండా చర్యలు తీసుకుంటూ ఫీవర్ సర్వే చేయాలన్నారు. యాంటీ లార్వా దోమలు ప్రబలకుండా బావుల్లో, నీటి ట్యాంకులలో ప్రతి వారం కెమికల్స్, ఆయిల్ సీడ్ బాల్స్ వేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను చైతన్యం కల్పించాలని సూచించారు. నగరంలోని 183మురికివాడలలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఆయా డివిజన్లలో సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో వార్డ్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంహెచ్ ఓ రాజి రెడ్డిను ఆదేశించారు. ఆయా కమిటీలు శానిటేషన్ సక్రమంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తారని, ముఖ్యంగా మురికివాడలలో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున శానిటేషన్ పై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజి రెడ్డి, హెల్త్ సుపరువైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు హాజరయ్యారు.