Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం.
సేంద్రియ వ్యవసాయంతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని ఎంపీపీ కందగట్ల కళావతి అన్నారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో జిల్లా స్వచ్చ భారత్ మిషన్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనాల వాడకంతో నేల సారం పూర్తిగా దెబ్బతింటుదన్నారు. జిల్లా స్వచ్చభారత్ మిషన్ ఈసీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్మీ కంపోస్టు వాడకంతో భూసారం పెరుగుతుందనఆనరు. సిద్ధిపేట జిల్లా నుండి వచ్చిన పుల్లూరు ఎంపీటీసీ వెంకట్ శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ..సేంద్రీయ వ్యర్థ పదార్ధాలమీద ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడము ద్వారా తయారు చేయబడే ఎరువునే వర్మి కంపోస్టు అంటారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం కుంటపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డ్ ను సందర్శించి వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేసే విధానాన్ని ప్రయోగత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశం,ఎంపీఓ కొమురయ్య,పంచాయితీ కార్యదర్శులు వివిధ గ్రామాల కారోబార్ లు, తదితరులు పాల్గొన్నారు.