Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘనపూర్
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఉద్యమం ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వానికి నిరసనగా స్థానిక మండల కేంద్రంలో శనివారం రైతు సంఘం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాల యంలో డీటీ జయ చందర్, ఇప్పగూడెం గ్రామ పంచాయ తీ కార్యదర్శులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొడపాక యాకయ్య పాల్గొని మాట్లాడుతూ అఖిల భారత ప్రజా సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా రైతు ఉద్యమం ఢిిల్లీలో ప్రారంభమై నేటితో 7నెలలు పూర్తికా వస్తునాన కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన సాగిస్తోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నూతన చట్టాలను, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నూతన చట్టాల సవరణలు, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టడానికి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణకు పూనుకున్నారని మండిపడ్డారు. కార్మిక,కర్షక ,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దేశానికి చీకటి రోజులు తీసుకొస్తున్నారన్నారు. తద్వారా అగ్రికల్చర్ సేవ్ డెమొక్రసీ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు. నేడు వైద్యరంగం కార్పొరేట్ చేతుల్లో ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రక టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గట్ల మల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తోట రమేష్, సీఐటీయూ మండల నాయకులు మర్రి రమేష్, జీఎంపీఎస్ మండల కార్యదర్శి మ్యాదర బోయిన కరుణాకర్ కేవీపీఎస్ మండల కార్యదర్శి మంద మహేందర్, డీవైఎఫ్ఐ మండల నాయకులు ఉల్లి రంజిత్, శాతాపురం రవి, శాఖా కార్యదర్శులు పొగాకు యాదగిరి, పొలాసు కిష్టయ్య, బొంకురి రామచంద్రు, శీను, వెంకటేష్ పాల్గొన్నారు.
రైతు వ్యతిరక చట్టాలను రద్దు చేయాలి
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్ల ఖబంధహస్తాల్లో పెట్టెసాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రైతు సంఘం జిల్లా నాయకులు చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు. శనివారం సీఐటీయూ, రైతు సంఘం , వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస తహసీిల్దార్ విజయ భాస్కర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్మిక ,కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తు దేశానికి చీకటి రోజులు తీసుకొచ్చారని అన్నారు. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు నగదు ఇవ్వాల న్నారు. నిర్బంధం, అణిచివేత, విచ్ఛిన్నం ఇకపై సాగనివ్వమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు, ప్రజా సంఘాల నాయకులు మాసం పల్లి నాగయ్య, ముస్కు ఇంద్రారెడ్డి, లావుడియా అనిల్ చౌహాన్, పనికర రాజు, లావుడియా జీవన్ చౌహన్, లావుడియా సుమన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.