Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి రామునాయక్
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కరోనా టీకా వేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాము నాయక్ సూచించారు. పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో ఉపాధ్యా యులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు. పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కరోనా నివారణ కోసం ప్రతి ఉపాధ్యాయునికి టీకా అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు విద్యా బోధనను అందించేందుకు ఉపాధ్యాయులు సమయం కేటాయిస్తారని అన్నారు. ఉపాధ్యా యులకు సైతం టీకా వేసేందుకు ప్రభుత్వం వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం దష్టి పెట్టడంతో పాఠశాలలో శానిటైజర్లు ఏర్పాటు చేసేందుకు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీల సహకారం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెన్నూరు, ముత్తారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు పోతుగంటి నరసయ్య, దీప్తి, సిబ్బంది రమేష్, సరేష్, నరేష్ విజరు, కిషన్, తదితరులు పాల్గొన్నారు.