Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుష్టు వ్యాధి నివారణ
- రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్
నవతెలంగాణ-పాలకుర్తి
కుష్టువ్యాధి రహిత సమాజాన్ని స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కుష్టు వ్యాధి నివారణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రిని ఆయన సందర్శించి కుష్టు వ్యాధి నివారణ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా వైద్య అధికారి మహేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా కుష్టు వ్యాధి గ్రస్తులపై దష్టి పెట్టలేదని తెలిపారు కరోనాతోపాటు కుష్టు వ్యాధి నివారణ ఒక భాగమేనని తెలిపారు కుట్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నివారణపై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అం దించాలన్నారు. కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం విజయవంతం చేసేందుకు వైద్య అధికారులతో పాటు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు కషిచేయాలన్నారు. వ్యాధి నివారణ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని అందరూ భాగస్వాములు అయ్యేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మండలంలో ఉన్న వ్యాధి గ్రస్తుల పై దష్టి పెట్టాలని వారికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆర్ సుధీర్, ఎల్ అశోక్ కుమార్, వైద్యాధికారినులు ప్రియాంక, యామిని, కుష్టు వ్యాధి నివారణ బాధ్యులు శేఖర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, డేవిడ్ పాల్గొన్నారు.