Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్
నవతెలంగాణ-రఘునాథపల్లి
సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలు ఐకమత్యంగా పనిచేయాలని హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ అన్నారు. శనివారం మండల పరిధి ఖిలాషాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటకు బీటలు వారి శిథిలావస్తకు చేరడంతో కోటను ఆయన సందర్శించారు . అనంతరం గీత సెల్ రాష్ట్ర కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బహుజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పాపన్న నిర్మించిన చారిత్రాత్మక కోటకు మరమత్తలు చేసి పాట్యపుస ్తకాలలో పాపన్న చరిత్రను చేర్చాలన్నాఉ. చేతకాదంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో తామే కోటను నిర్మిస్తామన్నారు. కబడ్దార్ బిడ్డ బహుజనులను విస్మరిస్తే బీసిలు మొత్తం నీకు అడ్డం తిరుగుతారని హెచ్చరించారు. తెలంగాణ లో దొర పాలనకు చరమగీతం పాడి గోలుకొండ కోట మీద జండా ఎగురవేయాలంటే అది ఖిలాషాపూర్ నుండే మొదలవు తుందని అన్నారు. పాపన్న కోట కూలి చుట్టుపక్కన ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చెయ్యాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టు నిర్మించి దానికి సర్దార్ సర్వయి పాపన్న పేరు పెట్టాలన్నారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నరేంద్ర మోడీ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, బీజేపీ జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వంగ రాము, ఆనంద్ గౌడ్, దివాకర్ గౌడ్, స్థానిక బీజేవైఎం నాయకులు రంజిత్, వాళ్ళలా ఉపేందర్ పాల్గొన్నారు.