Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్‌రెడ్డి
- ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ములుగు
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు గుండెబోయిన చంద్రయ్య, నాయకుడు జంపాల రవీందర్‌తో కలిసి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన 7 నెలలు గడచినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని హితవు పలికారు. లేనిపక్షంలో భవిష్యత్‌లో మరింత పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్ అమ్జద్ పాషా, గంగదారి స్వరూప, ముత్యాల రాజు, రమా జంగిలి సుధాకర్, బోడ రమేష్, గూడూరు మహిపాల్, రవీందర్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మండల వెంకన్న, ఆకుల రాజు, సైదులు, కంచె వెంకన్న, దేశెట్టి రామచంద్రయ్య మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ రైతు ప్రజా సంఘాలు నాయకుల అల్వాల వీరయ్య రాజన్న వెంకటేశ్వర్లు లింగ్యా నాయక్, దుడ్డెల రామ్మూర్తి పాల్గొన్నారు.
కురవి : మండలంలోని బంచరాయితండాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు తావు, గద్దోజు రమేష్, బిక్రీ, బ్రహ్మచారి, రాములు, వెంకన్న, శ్యామ్, బాల్య, మంగ్యా, బాలు, బాల్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం : ప్రజాసంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టెం ఆదినారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో నర్సింహారావు, కుమ్మరి శ్రీను, ముత్తయ్య, వంకా రాములు, సత్యం, కట్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకుడు తమ్మెర విశ్వేశ్వర్రావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొల్లం అశోక్, న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు యాకూబ్, సోమిరెడ్డి, తల్లా వెంకటేశ్వర్లు, జంజిరాల శంకర్, మాలోత్ సురేష్ బాబు, దర్గయ్య, శ్రీను, కుమార్, బందు మహేందర్, బండపల్లి వెంకటేశ్వర్లు, బొమ్మగాని సత్యనారాయణ, పల్లెల పాపారావు, జక్కుల యాకయ్య, లక్ష్మణ్, లచ్చిరాం, షరీఫ్, కేశవులు, రవీందర్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలో నిరసనలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు మండ రాజన్న విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండ గట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వల్లాల వెంకన్న, చంటి, పెంటయ్య, నాగయ్య, అశోక్, భద్రయ్య, వెంకన్న, జగనన్న, పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు తీగల ఆదిరెడ్డి మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పులిగుజ్జు వెంకన్న, చిట్టిబాబు, రాజేష్, గౌస్, కేతన్, సూర్యనారాయణ, చంద్రమౌళి, స్వప్న, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
దంతాలపల్లి : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఉమ్మడి నర్సింహులపేట మండల బాధ్యుడు మోహన్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బండి శ్రీనివాస్, వీరభద్రాచారి పాల్గొన్నారు.