Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి దున్ని దౌర్జన్యం
- ఆదుకోవాలని రెవెన్యూ,
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-మంగపేట
వారసత్వంగా వచ్చిన పంటభూమిపై రక్త సంబంధీకులైన బందువులే కన్నేసి ఆక్రమించుకునే కుట్ర చేయడమే కాకుండా 30 ఏండ్లుగా కబ్జాలో ఉన్న భూమిని దున్ని అడ్డుకున్న తమపై భౌతిక దాడులకు దిగుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మండలంలోని కోరుతూ రామచంద్రునిపేటకు చెందిన రాణిమేకల కృష్ణ దంపతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం మండల కేంద్రంలో బాధితులు విలేకర్లతో మాట్లాడారు. రామచంద్రునిపేట శివారులోని నిమ్మగూడెం రోడ్డు పంట కాల్వ సమీపంలోని 1.5 ఎకరాల పంట భూమిని 1986లో తన తండ్రి రాణిమేకల కోటయ్య వారసత్వంగా తన నలుగురు కొడుకులైన రంగారావు, భూపతిరావు, నాగేశ్వర్రావు, కష్ణలకు 13 గుంటల చొప్పున భూమిని పంచినట్లు తెలిపారు. అప్పటి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ములమైన తాము సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తన అన్న నాగేశ్వరరావు భార్య చనిపోయి అనారోగ్యంగా ఉండడంతో ఆయన బాగోగులు తామే చూసుకుని మరణానంతరం ఖర్చులు కూడా తామే పెట్టినందు వల్ల వారసత్వంగా ఆయనకున్న 13 గంటల భూమిని తమ బంధువులు, గ్రామస్తులు పంచాయతీలో తమకే అప్పగించారని చెప్పారు. అప్పటి నుంచి తామే సాగు చేసుకుంటుండగా ఇటీవల తన పెద్ద అన్న కుమారుడు రామచంద్రునిపేట రేషన్ డీలర్‌గా ఉన్న రాణిమేకల ప్రతాప్, ఆయన బార్య సుమలత, రెండో సోదరుడు భూపతిరావు అడ్డుపడుతూ ఆ భూమిని కాజేయాలనే ప్రయత్నంలో రెండ్రోజుల క్రితం భూమిని అక్రమంగా దున్ని అడ్డకున్న తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా భౌతికదాడులకు దిగుతున్నారని కష్ణ దంపతులు వాపోయారు. ఈ విషయంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు మోకాపైకి వచ్చి గ్రామంలోని పెద్దలను, తమ బంధువులను విచారించి న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.