Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న మెగా పార్కులతో ఆహ్లాదకర వాతావరణం నెలకొం టుందని జెడ్పీ సీఈఓ అప్పారావు తెలిపారు. తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం గ్రామంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా పార్క్ స్థలాన్ని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్‌లతో కలిసి సీఈఓ అప్పారావు సందర్శించి పరిశీలించి మాట్లాడారు. అన్ని మండలాల్లోనూ మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సువిశాలమైన స్థలంలో పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లను పెంచి పార్కును అందం గా తీర్చిదిద్దనున్నామన్నారు. గ్రామంలోని 43/244 సర్వే నెంబర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో మెగా పార్క్ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ నిర్ణయిం చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో గ్రామాల అభివద్ధి కోసం పల్లెల్లో ప్రకతి వనాల ఏర్పాటు చేస్తోందన్నారు. గతంలో గ్రామంలో డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన 30 ఎకరాల్లో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ఆ స్థలం నుంచి పదెకరాలను మెగా పార్కుకు కేటాయించినట్టు తెలిపారు. జమస్తాన్పూర్ గ్రామాన్ని మోడల్‌గా ఎంపిక చేసి ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ సహకారంతో మెగా పార్కును సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తా మన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షణ ఫలితంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మెగా పార్కు పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చొరవ చూపా లని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ గౌస్, జూనియర్ అసిస్టెంట్ వినరు, తదితరులు పాల్గొన్నారు.