Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నేతల డిమాండ్
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్లో నిర్మిస్తున్న అక్రమ ఇంటి నిర్మాణ అనుమతులను తక్షణం రద్దు చేయాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి గోగుల రాజు, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు యాల మురళీధర్‌రెడ్డి వార్డు కౌన్సి లర్లు బానోత్ హరిసింగ్, దౌలాగర్ స్వాతి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లా డారు. గృహ నిర్మాణ అనుమతులను ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నట్లుగా కేసీఆర్, కేటీఆర్ ఫిర్యాదు చేసినట్లుగా ఇంటి యజమానురాలు వెలగం ఉపేంద్ర, ఆమె కుటుంబ సభ్యులు చేసిన విమర్శ అర్థరహితమన్నారు. రోడ్డు విస్తరణ జంక్షన్ నిర్మాణంలో భాగంగా దాదాపు 50 గహాలను వెనక్కు జరిపి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, ఇంటి యజమాని కుమ్మక్కై సదరు వ్యక్తికి ఒక్కరికే మూడుకోట్ల జంక్షన్లో నిబంధనలకు విరుద్ధంగా గహనిర్మాణ అనుమతులు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. సదరు గహ నిర్మాణం ఐదు రోడ్ల కూడలిగా ఉన్న సెంటర్లో రోడ్డు పైకి వస్తుందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలను అతిక్రమించి పాలకవర్గం ప్రజాప్రతినిధులకు తెలియకుండా దొడ్డిదారిన అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మూడుకోట్ల జంక్షన్లో దాదాపుగా 50 మంది రోడ్డు విస్తరణతో ఇంటి స్థలాలను కోల్పోయి గహాలు నిర్మించుకున్నారని చెప్పారు. వారెవ్వరికి ఇవ్వని వెసులుబాటు వెలగం ఉపేంద్ర కుటుంబానికి ఎందుకు ఇచ్చినారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. సదరు తప్పుడు గహ నిర్మాణ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనతి కాలంలోలోనే నిజాలు తెలుస్తాయని తెలిపారు. ఉపేంద్ర కుటుంబానికి భారీగా ఆస్తులున్నా పేద కుటుంబమంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అధికారులను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఉపేంద్ర కుటుంబీకులు విదేశాల్లోనూ స్థిర పడ్డారని చెప్పారు. పట్టణాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాటు పడుతుంటే అభివృద్ధి నిరోధకులు తప్పుడు పనులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ వార్డు సభ్యులు గుండ్లపల్లి వీరేందర్ పాల్గొన్నారు.