Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యపోరాటాలే శరణ్యం ఏఐకేఎస్‌సీసీ నేతలు
నవతెలంగాణ-న్యూశాయంపేట
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థ విధ్వంసానికి కుట్ర చేస్తోందని ఏఐకేఎస్‌సీసీ నేతలు సారంపల్లి వాసుదేవరెడ్డి, రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్, వడ్డేపల్లి రాజేందర్, బీరం రాములు, సుదమల్ల భాస్కర్, వల్లందాసు కుమార్, బాబన్న, బండి కోటేశ్వర్రావు విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి, బాలరాజు, శ్రీనివాస్, రాజేందర్, రాములు, భాస్కర్, కుమార్, బాబన్న, కోటేశ్వర్రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులకు అండగా అన్ని తరగ తుల ప్రజలు ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఐక్యపోరాటాలే శరణ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు విజరు ఖన్నా, సంపత్, ఐలయ్య, మండల యుగంధర్, హరిబాబు పాల్గొన్నారు.