Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌సింగ్
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్‌కు మండలంలో పూర్వవైభవాన్ని తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పాటు పడతానని ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మూడు ప్రతాప్‌సింగ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 20 ఏండ్లుగా పార్టీలో కార్యకర్తగా పని చేసినట్టు తెలిపారు. తన క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తించిన క్రమంలోనే ఎమ్మెల్యే సీతక్క తనకు మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ నాయకులకు కతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు. సమావేశంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సూడి సత్తిరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య, పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, గాంధీనగర్ సర్పంచ్ భూక్య సుఖ్య, ప్రాజెక్ట్ నగర్ సర్పంచ్ సమ్మయ్య, నాయకులు పడిగె పార్వతి, తదితరులు పాల్గొన్నారు.