Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మరియమ్మ మృతి చెందిన కేసులో నిందితులపై అట్రాసిటీ కేను పెట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు గిన్నారపు మురళీ తారక రామారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల, గిరిజనుల, మహిళలల రక్షణ కరువైందన్నారు. మరియమ్మ మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు రాజేందర్, రాము, పద్మ, హన్మంతరావు, మురళీ, గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.
న్యాయవిచారణ చేపట్టాలి : న్యూడెమోక్రసీ
బయ్యారం : మరియమ్మ మృతి చెందిన కేసులో న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల, సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకుల చింతా వెంకన్న, రామచంద్రుల మురళీ, తోకల వెంకన్న, రాసమల్ల ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.