Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-ములుగు
పాలకులు ఏజెన్సీ చట్టాలను అమలు చేయాలని, గిరిజన యూనివర్శిటీని వెంటనే ప్రారంభించాలని, బిల్ట్ పరిశ్రమను పునరుద్ధరించాలని వక్తలు డిమాండ్ చేశారు. జూలై 8న వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయనున్న క్రమంలో మండలంలోని ఇంచర్లలో ములుగు జిల్లా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు వట్టం ఉపేందర్, కొమురం ప్రభాకర్, మొగుళ్ల భద్రయ్య, ఆషాడపు దేవేందర్, చాంద్ పాషా, పరక సుమన్, పరక శ్రీను, బోనగని యాదగిరి, సుదర్శన్, శనిగరపు చిరంజీవి, గంపల శివకుమార్ మాట్లాడారు. షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి ప్రణాళిక లక్ష్యాల ఎజెండా ప్రజల నుంచి రావాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా పార్టీ కార్యక్రమం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవా నాయక్, ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు బజారు శ్యాంప్రసాద్, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షుడు బాగె నర్సింహులు, నాయకులు అన్న తిరుపతి, దుగ్యాల ప్రవీణ్, అబ్బాస్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.