Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారులకు చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-గోవిందరావుపేట
పేదలను ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ను ప్రభుత్వం వినియోగిస్తోందని ఎంపీపీ సూర శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని దుంపెల్లిగూడెంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి ఆధ్వర్యంలో పలువురు లబ్దిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు పేదలకు సీఎంఆర్ఎఫ్ వర్తించేలా చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో సీఎంఆర్ఎఫ్ ఎవరికీ తెలియదన్నారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పోరిక గోవిందనాయక్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సూదిరెడ్డి స్వప్న లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు మోహన్ రాథోడ్, రాజు వాణినాయక్, గ్రామ అధ్యక్షుడు బండి రాజశేఖర్, సూరపనేని సాయిబాబు, బొల్లం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.