Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచి
మండలాల్లో సంబురాలు
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసిన నేపథ్యంలో ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంగపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, తాడ్వాయి మండల మాజీ అధ్యక్షులు బొల్లి దేవేందర్, భగవాన్‌రెడ్డి, లక్కీ వెంకన్న, అయ్యోరి యానయ్య, ల్యావుడ్య శ్యాంలాల్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలకమర్రి శ్రీనివాస్, దులిపాల బాలకష్ణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ మండల అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, సీతక్క యువజన మండల అధ్యక్షుడు సిద్దాబత్తుల జగదీష్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మహాబూబ్ ఖాన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయతుల్లా, ఇసార్ ఖాన్, కర్రి నాగేంద్రబాబు, మోయినుద్దీన్, వెంగల బుచ్చిరెడ్డి, ధీకొండ కాంతారావు, దామెర సారయ్య, చిలకల రాంబాబు, లొంక రాజు, సాంబయ్య, బసారి హరికష్ణ, గడ్డం చిరంజీవి, తోట అశోక్, ఆకుతోట వెంకన్న, పాడి చలపతి, కాకర్ల శ్రీను, సయ్యద్ హుసేన్, బండపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.
కురవి : మండల కేంద్రంలో సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు నారాయణ, రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాదె వీరభద్రం, కాట్యాల వినరు, కామిండ్ల వీరన్న, తరాల వీరభద్రం, కామిండ్ల ఆనందం, అనబత్తుల వీరభద్రం పాల్గొన్నారు.
వాజేడు : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దాట్ల సీతారామరాజు, వాజేడు నాగారం సర్పంచ్ తలడి ఆదినారాయణ, సొసైటీ ఉపాధ్యక్షుడు వత్సవాయి జగన్నాథరాజు, నాయకులు ఖాజావలీ, కాకర్లపూడి సత్యనారాయణ, కురసం రాంబాబు, సాబీర్ పాషా, చిక్కుడు వెంకటేశ్వర్లు, నర్సింహారావు, లేగల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. అనంతరం సత్యనారాయణ, కుమారస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గంగు కష్ణమూర్తి, కాంగ్రెస్ అనుబంధ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, ఎంపీటీసీలు బొమ్మగాని మానస భాస్కర్, కమ్మగాని పుష్పలీల నాగన్న, నాయకులు బైరు భార్గవ్, లావుడ్య భాస్కర్, జలగం కుమార్, చారగొండ్ల సత్తయ్య, గుగ్గిళ్ల ఆదినారాయణ, బైకాని ఐలేష్, కమ్మగాని మహేష్, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో, పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముసలయ్య, పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారామయ్య, మండల ప్రధాన కార్యదర్శి గట్ల గణేష్, మహిళా అధ్యక్షురాలు తొట్టి హైమవతి, మండల ఉపాధ్యక్షుడు మాడే బాబు, నాయకులు బాను, కోడి వీరన్న, పోట్ల విద్యాసాగర్, కేసా నిరంజన్, మహేష్, తిరుమల సుధాకర్‌రెడ్డి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
గార్ల: నెహ్రూ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు, ఎంపీటీసీ గుండెబోయిన నామణి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, నగేష్, అమీర్ ఖాన్, రెడ్డి, నవీన్, భిక్షపతి, వీరూ, లాల్ సింగ్, శారద, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుట్టయ్యతో కలిసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెవిటి సధాకర్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షులు చిత్తలూరి శ్రీనివాస్, మెరుగు మల్లేశం గౌడ్, కౌన్సిలర్ భూసాని రాము, తూనం రోజా ప్రభుదాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ధీకొండ శ్రీనివాస్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవినాయక్, మాటేడు సర్పంచ్ వల్లపు శోభ యాకయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భిక్షం గౌడ్, నరేందర్‌రెడ్డి, రాహుల్ యువసేన నాయకుడు రాయిపల్లి రాజు, పార్టీ నాయకులు లింగన్న, ఆగమల్లు, వెల్తురు మల్లేష్, దయాకర్, నరేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తండా రవి, రాంబాబు, కుమార్ యాదవ్, అన్వేష్ గౌడ్, మురళీ, రాంపల్లి రవి, తండాల శ్రీకాంత్, వెంకటేష్, ఉపేందర్, నరేష్, రంగయ్య, అబ్బాస్ పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో, మార్కెట్ సెంటర్లో, గాంధీ సెంటర్లో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ సభ్యుడు దస్రూనాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మెన్ బండారి వెంకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు చిరగని సారయ్య, అయూబ్ ఖాన్, ఎంపీటీసీలు గంట అశోక్‌రెడ్డి, కందాల కష్ణమూర్తి, తండా వెంకటేశ్వర్లు, గోపాల్‌రెడ్డి, కూరెళ్లి సతీష్, గండి శ్రీనివాస్, నూకల వెంకటేశ్వర్లు, కొట్టం మహేందర్, కళ్లెం శ్రీనివాస్, లింగాల నేతాజీ, రాజులపాటి మల్లయ్య, సట్ల శ్రీనివాస్, మూల భూలోకరెడ్డి, బాలాజీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అనంతరం రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దనాగారం స్టేజి సర్పంచ్ బొబ్బ సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, మండల నాయకులు సతీష్, అలవాల శ్రీనివాస్, అనిల్, గుగులోతు రవి, అశోక్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దంతాలపల్లి : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షులు బట్టు నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు నెమ్మది యాకయ్య, కొమ్మినేని సతీష్, తండా చిన్నరాములు, సతీష్, ఏరుకొండ యాకయ్య, రమేష్, ఉప్పలయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకుడు పోరెడ్డి మల్లారెడ్డి, సాంస్కతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిన శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సాదం విజయ మనోహర్, కళ్లెం పీఏసీఎస్ డైరెక్టర్ మూర్తి, ఎంపీటీసీ బర్ల మాధవి కుమార్, ఎంపీటీసీ గుగ్గిళ్ల నర్సయ్య, మాజీ సర్పంచ్ సాయి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ భృగు మహర్షి, మాణిక్యపురం విజయ డెయిరీ చైర్మెన్ రాగం నారాయణ యాదవ్, సీనియర్ నాయకులు పోకల కుమారస్వామి, లింగాల గణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు రాజిరెడ్డి, వనపర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు మన్నె యాదవరెడ్డి, కొత్తపెల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ ఉపేందర్, నెల్లుట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రామలింగం, మాణిక్యపురం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చౌదర్పల్లి రాజు, కడగంటి రమేష్, బెజ్జం ఆంజనేయులు, బోయిని దుర్గ, కడకంచి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మెన్ పొన్నాల ఎల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్సం కన్నయ్య, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి కాడబోయిన రవి, ఎంపీటీసీలు గోపిదాసు ఏడుకొండలు, ధారావత్ పూర్ణ గాంగు, సర్పంచ్‌లు లావుడ్య లక్ష్మీ జోగానాయక్, ముద్దబోయిన రాము, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య రాజు, మండల నాయకులు సూదిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, చాపల కిషన్‌రెడ్డి, పాడ్య రాజు, బొల్లు కుమార్, ఆర్వీకే, మూడ్ ప్రతాప్, జంపాల చంద్రశేఖర్, పెండెం శ్రీకాంత్, యూత్ నాయకులు గుంటి సంపత్, సింగపురం కష్ణ, అరవింద్, గుండె శరత్, వక్కల సతీష్, సంగి శివ, తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల ఇన్‌ఛార్జి ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పసునూరి రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధర్మారం భిక్షపతి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జాటోత్ రవినాయక్, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు అయిత రాజు, బోయిన కమలాకర్, జంపాల శ్రీను, అంజయ్య, అశోక్, మల్లేష్, పరశురాములు, దేవా, తదితరులు పాల్గొన్నారు.