Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల ఆటో డ్రైవర్ల సంఘానికి చెందిన పట్టెం శ్రీను, సాంబయ్య, పగిడిల తల్లి పట్టెం లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం ఆమె ధశదిన కర్మకు హాజరైన సంఘం ప్రతినిధులు ఆర్థికసాయం అందించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. పదేండ్లుగా యూనియన్ ఆధ్వర్యంలో సభ్యుల కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా సంఘం అండగా ఉంటోందని తెలిపారు. కష్టాల్లో అండగా ఉండే ఆటో యూనియన్ ఇబ్బందుల్లో ఉండే వారిని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తిమ్మంపేట ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు