Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ ఎంఎల్, జనశక్తి ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-నర్సంపేట
పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్), జనశక్తి ఆధ్వర్యంలో ఆదివారం పెట్రోల్ బంకు ఎదుట నిరసన తెలిపారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఎలగంటి రాజేందర్, సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఈర్ల పైడీ మాట్లాడారు. ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి బ్రతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్న నేటి తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారం మోపుతుండడం దుర్మార్గమన్నారు. అంతర్జా తీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నా, భారత్‌లో వాటి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో అమల్లోకి కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ పరిధిóలోకి పెట్రలీయం ధరలను ఎందుకు తీసుకరాలేదని వారు ప్రశ్నించారు. ఏడాదిన్నర కరోనా కాలంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతుంటే కేంద్రం ప్రజలపై పన్నులను వేయడమే పనిగా పెట్టుకొందని విమర్శించారు. మరో వైపు రాష్ట్ర ఫ్రభుత్వం వేలాది ఎకరాల భూములను విక్రయించి ఆదాయాన్ని కూడగట్టుకోవాలని చూస్తుందన్నారు. వెంటనే భూముల అమ్మకాలపై జారీ చేసిన జీవో 13ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ స్త్రీసంఘటన రాష్ట్ర కార్యదర్శి మోడెం శ్రీలత, ఎన్డీ జిల్లా నాయకులు జక్కుల తిరుపతి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఈరెల్లి రామ్‌చందర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా నాయకులు ఆర్.సుమన్, డీ.సురేష్, రంజిత్, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు కుమార్, అనిల్, ఏఐకేఎమ్ఎస్ నాయకులు మల్లయ్య, పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.