Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోని వైనం
- అధికారులు... పట్టించుకోండి..?
నవతెలంగాణ-శాయంపేట
రైతుల సమస్యలను పరిష్కరించే వేదికగా ప్రభుత్వం ప్రతి క్లస్టర్లో రూ. 22లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారంభానికి నోచు కోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారు తున్నాయి. అధికారులు పట్టించుకుని అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే... శాయం పేట, ప్రగతిసింగారం, పెద్దకొడపాక, గట్లకానీపర్తి గ్రామాలలో రైతు వేదిక నిర్మాణాలు చేపట్టారు. పెద్దకొడపాక రైతు వేదిక భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రగతిసింగారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. మిగిలిన శాయంపేట, గట్లకానీపర్తి గ్రామాలలో నిర్మించిన రైతు వేదిక భవన నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. శాయంపేట రైతు వేదిక భవనం సమీపంలోనే వైన్ షాపు ఉండడంతో మద్యం ప్రియులు మందు కొనుగోలు చేసుకొని రైతు వేదిక భవనం వరండాలో ఆదివారం మద్యం సేవి స్తుండగా నవతెలంగాణ క్లిక్ మనిపించింది. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదిక భవనాలు ప్రారం భానికి నోచుకోక మందుబాబులకు అడ్డాగా మారుతు న్నాయని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు వేదికలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.