Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల ఆదివారం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంథాజీ మాట్లాడుతూ.. పార్టీకి మంచిరోజులు వచ్చాయన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు అశోక్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి డాక్టర్ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి మండ సుమన్, శనిగరం వెంకటేష్, సర్పంచ్ రవీందర్‌రెడి,్డ బుసారి వినరు, శ్రీకాంత్ మహేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- చిట్యాల
టీపీసీసీ నూతన అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని నియమించడంతో మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుట్లా తిరుపతి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కోడరి సారయ్య, మూల శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌నాయక్, లాడే రాజేశ్వరరావు, నందిరాజు, కిషోర్, రత్నం తిరుపతి, దుప్పటి రమేష్, గోవిరాల రాజు, మూల రమేష్, జంపయ్య, మధుకర్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆదివారం మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మడికొండ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి అధికారం చేపట్టగానే తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యడ ఓం ప్రకాష్, సంతోష్, జలుగూరి రత్నాకర్, జన్ను మనోజ్, అఖిల్, రవి పాల్గొన్నారు.
సంగెం : టీటీపీసీసీ అధ్యక్షుడిగా అనుముల రేవంత్‌రెడ్డిని నియమించడంతో మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా పరకాల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకల అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. యువ నాయకత్వానికి టీపీసీసి పగ్గాలు ఇచ్చినందుకు తెలంగాణ తల్లి సోనియాగాంధీ కతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దె దింపాలని పేర్కొన్నారు. అందుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చోల్లేటి మాధవరెడ్డి, మాజీ ఎంపీపీలు బొమ్మల కట్టయ్య, కక్కెర్ల సదానందం, సంగెం సొసైటీ డైరెక్టర్ జనగాం రమేష్, నాయకులు గుండెటి ఎల్లయ్య, మడత కేశవులు, అచ్చ నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు ఆగపాటి రాజు, గుండెటి శ్రీకర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ : టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత ్‌రెడ్డిని నియమించడంతో స్థానిక అమరవీరుల స్థూపం ఎదుట ఆదివారం కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మట్లాడుతూ.. సమర్థుడైన రేవంత్‌ను కార్యకర్తల అభీష్టం మేరకు పీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు రొండి రాజు, జాలిగపు వనమాల-సారయ్య, గ్రామశాఖ అధ్యక్షులు జాలిగపు దుర్గయ్య -లక్ష్మి, అంకం రాజకుమారి, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పాషా, కొంగంటి రంజిత్, సీనియర్ నాయకులు బొడ్డు ప్రేమ్‌రాజ్, ప్రతాప్, మాచర్ల రవీందర్, వసంతకుమార్, ఆల్బర్ట్, భూపాల్ రెడ్డి, పాపిరెడ్డి, విజయభాస్కర్, చార్లెస్, మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
గణపురం : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్సి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. బుద్దారం గ్రామంలో రేవంత్ రెడ్డి యూత్ అద్యక్షుడు కార్తీక్ రావు, చెలుమల్ల రాజేందర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భువనసుందర్, మార్త జితేందర్, దుర్గయ్య, దూడపాక పున్నం, కష్ణ తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహిం చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వైనాల రవీందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ మండల నాయకులు దయాకర్ ,రాజు , ఓదెలు సంపత్, మధుకర్ ,నరేష్ , వెంకటేశ్వర్లు, విఘ్నేష్, అనీల్, రాజేంద్రప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ రూరల్ : టీపీసీసీ అధ్యక్షుడిగా అనుముల రేవంత్‌రెడ్డి నియమించడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బక్కి అశోక్ ఆధ్వర్యంలో నెక్కొండలోని ప్రధాన కూడళ్లలో బాణసంచా కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్, నాయకులు చెన్నకేశవులు, సుబ్బారెడ్డి, సాయిక్రిష్ణ, నర్సింహారెడ్డి, సాంబయ్య, మల్లిక్యాదవ్, శివకుమార్, ప్రశాంత్, శ్రీకాంత్, దిలీప్, రవి, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళ పల్లి : టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బస్టాండ్ కూడలి ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రావి శెట్టి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రాజేందర్, టౌన్ అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు నీరటి సంతోష్, కార్యకర్తలు నరేష్, రాకేష్ రెడ్డి, అజరు రెడ్డి, రాజు, ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రక్తాని గోపాల్ రావు, భద్రయ్య, నరసింగా రావు, మంగళపల్లి శ్రీనివాస,్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, లింగమూర్తి, ఆకుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావు పేట : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంతో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మొగలి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య, మాజీ ఎంపీటీసీ ఇంద్ర రెడి,్డ గ్రామ పార్టీ అధ్యక్షులు తల్లపెల్లి నర్సయ్య, మండల నాయకులు భిక్షపతి, సర్పంచులు తూటి పావని రమేష్, వెల్దె సుజాత సారంగం, భూక్య భద్రు, బొజేరువు, ఎంపీటీసీ మౌనికసుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు .వీరస్వామి, పెండ్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మండలంలోని రాపల్లి కోటలోల ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, రాజయ్య నిలయ గట్టయ్య, సమ్మయ్య, రాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు
హసన్‌పర్తి: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో గంటూర్‌పల్లిలో పార్టీలకతీతంగా సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ బలోపేతంలో రేవంత్‌రెడ్డి పాత్ర కీలకమన్న సంకేతాలు నాయకుల సంబురాలతో తేటతెల్లమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి ఎంపిక తెలంగాణ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపనున్నట్లు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కిరణ్‌రెడ్డి, సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎంపీకను స్వాగతిస్తూ కాంగ్రెస్ జెండాలతో హసన్‌పర్తిలో గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం బస్టాండులో బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్, నాయకులు నన్నెంశెట్టి స్వామి, కనపర్తి కిరణ్; తాళ్ల మధు, జన్ను రవీందర్, పుల్లా జార్జీ, నన్నెంశెట్టి గోపి, దూడల ప్రకాష్, పుల్లా రవీందర్, ఆరెల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.