Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
నవతెలంగాణ-ములుగు
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని సర్వాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రమేష్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్మికుల సమావేశానికి రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పంచా యతీ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నా ప్రభుత్వం సరైన వేతనం, ఇతర అలవెన్సులు, అర్హులకు ఉద్యోగోన్నతులు కల్పిం చడం లేదని విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఏజెన్సీలో సేవలు అందించిన పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కనీసం ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వేతనాలు అరకొరగా ఇస్తున్నా రని, సకాలంలో ఇవ్వడం లేదని, తదితర సమస్యలను వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులకు పీఆర్సీ వర్తింపజేయడంతోపాటు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతినెలా మొదటి వారంలోనే వేతనాలు అందజేయాలని, పని భారం తగ్గించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, తదితరాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను సమీకరించి అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి సమరశీల పోరాటాలు నిర్మించడం ద్వారా ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ నాయకులు గుండెబోయిన రవిగౌడ్, విష్ణు, వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, పాయం నరేష్, భగవాన్, కన్నయ్య, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.