Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య
నవతెలంగాణ-జనగామ
అమరుల ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు అధ్యక్షతన ఆలకుల పెంటయ్య 9వ వర్ధంతి ఆది వారం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా నాగయ్య హాజరై పెంటయ్య చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లా డారు. పెంటయ్య జిల్లాలో కార్మికుల, హమాలీల సమస్యలపై పోరాటాలు నిర్మించారని చెప్పారు. కనీస వేతనం కోసం అలుపెరుగని పోరాటం నిర్వహించారని తెలిపారు. అమరుల ఆశయాలు కొనసాగాలంటే వామపక్ష భావజాలం కలిగిన శక్తులను ఏకం చేసి ప్రభుత్వ విధానాలను ఎప్ప టికప్పుడు ఎండగట్టాలని చెప్పారు. కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పెంటయ్య కుటుంబీకులు శ్రీనివాస్, వేణు గోపాల్రావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎదునూరి వెంకట్రాజం, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపీ, రాపర్తి సోమన్న, సింగారపు రమేష్, మీట్యానాయక్, శేఖర్, నరేందర్, సోమన్న, జోగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.