Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- గ్రామ అభివృద్ధి కమిటీలు చురుగ్గా పనిచేయాలి : జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య
- పల్లెలు పట్టణాలతో సమానంగా అభివృద్ధి చెందాలి : ఎమ్మెల్యే గండ్ర
- జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో హరితహారంపై సమీక్ష
నవతెలంగాణ-భూపాలపల్లి
సమిష్టిగా కషిచేసి 4వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజనాభివద్ధి, మహిళా-శిశు సంక్షేమశాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జులై 1 నుండి 10వ తేదీ వరకు పది రోజుల పాటు 4వ విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో 4వ విడత పల్లెప్రగతి పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహణపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడారు. జిల్లాను అభివద్ధిపర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా కషిచేయాలన్నారు. 4వ విడత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈనెల 30న జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో ముందస్తుగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించి అవసరమైన పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. దళితవాడలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలు పరిష్కరించాలన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చి వేయాలన్నారు. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. స్మశానవాటికలు, డంపింగ్ యార్డుల చుట్టూ బయోపెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పాడుపడ్డ బావులను పూడ్చి వేయాలని, పాడుబడ్డ భవనాలను కూల్చివేయాలని అన్నారు. 10 శాతం గ్రీన్ బడ్జెట్తో పచ్చదనం పెంపొందేలా హరితహారం చేపట్టాలన్నారు. గతంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలన్నారు. పూర్తైన అభివృద్ధి పనులను ఉపయోగంలోకి తీసుకురావాలని, పెండిం గ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పైపులైన్లకు అవసరమైన చోట మరమ్మతులు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్కు రూ.25 లక్షలు, కలెక్టర్కు రూ.కోటి, మంత్రులకు రూ.2 కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారని అన్నారు. పాఠశాలల మరమ్మతు పనులను పూర్తి చేయాలని అన్నారు. రేగొండ నుండి కాళేశ్వరం వరకు రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం పెరిగేలా ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 8 నుండి 9 లక్షల దళిత కుటుంబాలు ఉన్నా యని, వాటిలో 5 నుంచి 6 లక్షల కుటుంబాలు నిరుపేద కుటుంబాలున్నాయని, వారికి విడత లవారీగా ఉపాధి కల్పించాలన్నారు. ఇందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గోదావరి నుండి ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తూ స్థాని కంగా ప్రభుత్వ నిర్మాణాలకు ఇవ్వడం లేదని, ఇబ్బంది కలుగుతుందని ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఇసుక క్వారీల వద్ద జిల్లా అవసరాలకు అవసరమైన ఇసుకను అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంద్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడుతూ... 4వ విడత కార్యక్రమంలో అందరూ సమిష్టిగా పనిచేసి విజయ వంతం చేయాలన్నారు. బాగా పని చేసిన గ్రామాలలో ప్రతి మండలం నుంచి 2 గ్రామాలను ఎంపిక చేసి ప్రోత్సాహకంగా ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తామని తెలిపారు. గ్రామ అభివద్ధి కమిటీలు చురుగ్గా పని చేయాలని, అధికారు లు దళితవాడల్లో పర్యటించి అభివద్ధికి అవసరమైన సమస్యలను గుర్తించాలన్నారు. ఎమ్మ్లెఏ్య గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 100శాతం మొక్కలు బతికేలాక చర్యలు తీసుకో వాలన్నారు. భూపాలపల్లి పట్టణంలో సింగరేణి సహకారంతో హరితహారం, అభివద్ధి పనులను చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో పేరుకుపోయిన విద్యుత్ సమస్యలు తీర్చాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ వలన దెబ్బతిన్న అంతర్గత రోడ్లను బాగు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ విలీనం గ్రామాలలో కూడా పార్కులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఐదు వార్డులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పట్టణ ప్రగతి విజయవంతమయ్యేలా చూడా లన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, మున్సిపల్ చైర్పర్సన్ షెగ్గం వెంకటరాణి, ఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఆర్డిఓ పురుషోత్తం, జడ్పీ సీఈఓ శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.