Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. దళిత సాధికార పథకం ప్రకటించిందుకు కతజ్ఞతగా మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దళితులు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించేం దుకు ఏడేండ్లలోనే రూ.55వేల కోట్లు ఖర్చుచేయ టంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిం దన్నారు. ఈ పథకం ద్వారా 1190 మంది దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. దళితు లను అణచివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ పరంగా సాయం అందేందుకు ప్రస్తుత పథకాలే కాకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి రూ.10లక్షలు జమ చేయడం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. దళిత రిజర్వేషన్ కల్గిన ఈ నియోజకవర్గ పరిధిలో దళితుల ఉన్నతికి కషి చేస్తానని అన్నారు. ప్రత్యేక నిధులను అందించి డివిజన్ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, ప్రతీ గ్రామానికి దేవాదుల ద్వారా సాగునీరు అందించే దిశగా సీఎం తో చర్చించినట్లు తెలిపారు. తాటికొండలోని వల్లబరా యిని చెరువుకు సాగునీరందించేందుకు స్థానిక వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి చొరవ అభినందనీయమన్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు దళితులకు అందాయని మిగిలిన పాలనా కాలంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా అందరూ శ్రమించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, జిల్లా జడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు బొల్లం మణికంఠ(అజరు), వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, ఎంపిటిసిలు సింగపురం దయాకర్, బెల్లపు వెంకటస్వామి, గుర్రం రాజు, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు వేముల నర్సింగం, యూత్ నాయకులు మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, ఆకారపు అశోక్, తదితరులు పాల్గొన్నారు.