Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండల పరిధి పర్లపల్లి గ్రామంలో మంగళ వారం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. కరోనా పాజిటివ్, నెగటివ్ వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీజనల్ వ్యాధులు, కరోనా వైరస్పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించాలన్నారు. హెల్త్ క్యాంపునకు వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి మందులు ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు నమ్మొద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవా లన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆరోగ్య పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జోరుక సదయ్య, టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రేమలత, డాక్టర్ సుప్రియ, సీిహెచ్ఓ వెంకటస్వామి, ఏఎన్ఎం సునిత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
టేకుమట్ల : అధికారులు అందరూ అందు బాటులో ఉండాలని జయశంకర్ భూపాలపల్లి నియో జకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రామకష్టపూర్(టీ) గ్రామంలోని ఎమ్మార్సీ భవనంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు గడిచిన మూడు నెలల్లో జరిగిన అభివద్ధికి సంబంధించిన నివేదికలు చదివి వినిపిం చారు. విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పలు గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దష్టికి తీసుకురావడంతో ఆయా శాఖల అధికారులపై మండిపడ్డారు. 3నుండి 4 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవని మిషన్ భగీరథ విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. జులై 1నుండి 10 వరకు జరిగే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పారిశుధ్యం, ఆరోగ్యం గ్రామీణ మౌలిక సదుపాయా లు హరితహారం తదితర కార్యక్రమాలను గ్రామాల లో కొనసాగించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలాని సూచించారు. అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అంకు షాపూర్ గ్రామంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా పలువురికి దోమతెరలు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 50మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, తహసీల్ధార్ షరీఫ్ మోహినుద్దీన్, ఎంపీడీవో చండీరాణి, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.