Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో బడులు తెరిచేది అనుమానమే..
- జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభం
నవతెలంగాణ-మల్హర్రావు
కరోనాతో బడులు మూత పడ్డాయి. పుస్తకాలు అటకెక్కాయి. ప్రాథమిక పాటశాల విద్యార్థులు దాదాపు రెండేండ్లుగా విద్యకు దూరమవ్వడంతో ఓనమాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఆన్లైన్ బోధన ప్రారభించడానికి విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆన్ లైన్లో బోధనకు సరిపడా టీవీలు, సెల్ ఫోన్స్ తదితర గ్యాడ్జెట్లు ఉన్నాయా.? అనే దానిపై విద్యాశాఖ అధికారులు సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విద్య సంవత్సరం నష్టపోకుండా విద్య బోధన చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మరో పక్క కరోనా థర్డ్ వేవ్ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. విద్యా రంగంపై కరోనా మహమ్మారి వ్యాప్తితో మిగతా రంగాలతో పోలిస్తే విద్యా రంగం తీవ్రంగా నష్టపోయింది. గత విద్యా సంవత్సరం కేవలం బడులు పట్టుమని 45 రోజులు కూడా కొనసాగని పరిస్థితి. ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఇలాగే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు విద్య సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూన్ లో పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ ద్వారా తరగతులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఇటీవల ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అయితే గత సంవత్సరం నుంచి ఆన్ లైన్ బోధన చేస్తున్నప్పటి నుంచి చాలమంది పేద విద్యార్థులు వాటిని అందుకోలేని పరిస్థితి నెలకొంది. దీన్ని గమనించేందుకు ఎంతోమంది వద్ద సెల్ ఫోన్లు, టివి లు, ట్యాబ్, కంప్యూటర్ లు అందుబాటులో ఉన్నాయో అని తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారు.
బడులు తెరుచుకునేనా ?
కరోనా నేపథ్యంలో గత ఏడాది రెండు నెలలు మాత్రమే బడులు తెరిచారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లాలని అదేశించడంతో విధులకు హాజరైన వారు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. కొన్ని చోట్ల విద్యార్థులు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బడులు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా ఎక్కువ కాలం విద్యార్థులు బడికి వేళ్ళని కారణంగా చాలామంది విద్యార్థులు చదువులో వెనకబడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అంగన్వాడీల నుంచి నేరుగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరే విద్యార్థులు గత సంవత్సరం పాఠశాలల మొఖం కూడా చూడలేదు. మండలంలో వీరి సంఖ్య దాదాపుగా 3వందల వారికి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బదులు తెరుచుకోకపోతే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం జూలై1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారబించాలనే స్పష్టత ఇచ్చినప్పటికీ నేరుగా బడుల్లో ప్రత్యేక బోధనకు అవకాశం లేదని తెలుస్తోంది.
మండలంలో ఇలా...
మండలంలో మొత్తం 5 జిల్లా పరిషత్, 2 ప్రాథమికోన్నత , 22 ప్రాథమిక, ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1872 మంది విద్యార్థులు విడినభ్యసిస్తున్నారు. ఇందులో 72 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 40మంది విద్యావాలింటర్లు ఉన్నారు. కానీ ఒక్క పాఠశాలలో కూడా పర్మినెంట్ అటెండర్ లేరు. తాత్కాలికంగా సిబ్బందిని పెడితే వారిని ఇటీవల తొలగించారు. దీంతో బడుల్లో క్లాస్ రూమ్స్, మరుగు దొడ్లు శుభ్రం చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.