Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి
- బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ములుగు
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించగా ముఖ్యఅతిథిగా భాస్కర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తొలి దశలో స్థానికులు, స్థానికేతరులకు నడుమ జరిగిన ఉద్యమం తెలంగాణా ఉద్యమానికి దారి తీసిందని తెలిపారు. మలిదశ ఉద్యమం నీళ్లు, నిధులు నియామకాల కోసం విద్యార్థులతో ఉధతమై వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలకు ఒడిగట్టారని చెప్పారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకుని ఏడేండ్లు గడచినా టీఎస్పీఎస్సీ 105 నోటిఫికేషన్ల ద్వారా కేవలం 29 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయని వివరించారు. గ్రూప్-1, జేఎల్, డీఎల్, తదితర నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, 31 నెలలకు సంబంధించిన నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, జిల్లా అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీమంతుల రవీంద్రచారి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కష్ణాకర్రావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాయికంటి పరమేశ్వర్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సురేందర్, జిల్లా నాయకులు యాద సంపత్, మండల అధ్యక్షుడు ఉమ్మడి రాకేష్ యాదవ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు తైలం అశోక్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతిరెడ్డి రాకేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సానికొమ్ము హరీష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీరా కిషోర్ నాయక్, రెడ్డి రంజిత్, జిుకల శ్రావణ్, జిల్లా కార్యదర్శి గుమ్మడవెల్లి లక్ష్మణ్, బీజేవైఎం వెంకటాపూర్ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు వేల్పుల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జనార్ధన్, ములుగు మండల ప్రధాన కార్యదర్శి కనుకుల అవినాష్, తదితరులు పాల్గొన్నారు.