Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు...
- ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి
- జిల్లా విద్యాధికారి వాసంతి
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో జూలై 1 నుంచి 3 నుంచి పదో తరగతుల విద్యార్థులకు దూరదర్శన్, టి-శాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారని డీఈఓ వాసంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు ప్రతిరోజూ 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల్లోని ఎంత మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు వినడానికి ఉపకరణాలున్నాయనే సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఆన్లైన్ తరగతుల విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చేర్చాలని, గ్రామ విద్యా నమోదు పుస్తకాన్ని అప్డేట్ చేయాలని, విద్యార్థులను తరగతితోపాటు సబ్జెక్టు వారీగా దత్తత తీసుకోవాలని, ఫోన్ ద్వారా అనుమానాలు నివత్తి చేయాలని సూచించారు. ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేయాలని కోరారు. ప్రయివేట్ పాఠశాలల యజమాన్యాలు జీఓ నెంబర్ 75ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గత విద్యా సంవత్సరంలో నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూల్ చేయాలని, కేవలం నెలవారీగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తేటతెల్లం చేశారు.