Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెప్రగతి, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ -న్యూశాయంపేట
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పల్లెలు, పట్టణాలు ప్రగతిపథంలో పయనించేందుకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్ లోని విష్ణుప్రియ గార్డెన్ లో వరంగల్ రూరల్ జిల్లా నాల్గవ విడుత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశం జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఅర్ స్వయంగా రూపొందించి అమలుచేస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కొందరు సర్పంచులు అంకిత భావంతో పనిచేస్తున్నారని, కొందరు సర్పంచులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని తెలిపారు. కానీ జూలై పదో తేది వరకు పూర్తికాని వైకుంఠ దామలు, పల్లె ప్రకతి వనాలు, డంపింగ్ యార్డ్ లు పూర్తి చేయాలనీ ఆదేశించారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరిగే కార్యక్రమం గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి అధికారి గ్రామాలలో పర్యటంచి పల్లె నిద్ర చేయాలని ఆదేశించారు ఈ పథకం అమలుకు ప్రతి గ్రామానికి పట్టణాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. గత సర్పంచుల కంటే ప్రస్తుత సర్పంచులు అదష్టవంతులని, ప్రతి గ్రామం లో చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. కాబట్టి ప్రజా పతినిధులు అధికారులు అంకితభావంతో పనిచేసి కార్య కమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమా వేశంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.