Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ సహకారంతో 'మనబడి-మనబాధ్యత' కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆయన వర్క్బుక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదపిల్లల చదువును సామాజిక బాధ్యతగా తీసుకొని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన బడి మన బాధ్యత పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్ధి దశలోనే పుస్తక పఠనం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాంకిషన్‌రాజు, వర్ధన్నపేట మనబడ-మన బాధ్యత కన్వీనర్ దోమ కుమార్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, వివిధ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మార్పీ అజాం తదితరులు పాల్గొన్నారు.