Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ కమలాపూర్
నిరుపేద దళితులకు పట్టాలు ఇవ్వాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తహశీల్దార్ జహీర్పాషాకు మంగళళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కోనేరు రంగారావు కమిషన్ మేరకు మండల కేంద్రంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేస్తున్న నిరుపేద దళిత రైతులకు పట్టాల జారీ చేయాలని, కానీ అధికారులు పట్టాల జారీని నిలిపివేశారని పేర్కొన్నారు. దానితో చాలా మంది నిరుపేద దళిత రైతులు పట్టాలు రాక రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా దళిత అభివద్ధి కోసం అమలు చేస్తున్న దళిత సాధికారితలో భాగంగా ఈ సమస్యను గుర్తించి మండల కేంద్రంలో గ్రామాలలో ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు చిలివేరు సంపత్, మోరే రంజిత్, మంద రవీందర్, వేల్పుగొండ భద్రయ్య, ఇసంపల్లి జయరాజు, పెరుక శ్రీనివాస్, వేల్పుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.