Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బలోపేతం
- పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
- హైదరాబాద్‌కు భారీగా తరలిన జనసైన్యం
నవతెలంగాణ-ములుగు
కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు సుపరిపాలన అందిందని ఆ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కానుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా కేంద్రం నుంచి మంగళవారం భారీగా జనసైన్యం తరలగా సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ల ర్పించారు. అలాగే గట్టమ్మ ఆలయంలో ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 100 కార్లతో ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. పోడు భూమి, తదితర అనేక సమస్యలు ప్రజలను వేధిస్తుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపిందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ నల్లెల కుమారస్వామి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అనుబంధ సంఘాల మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సహకార సంఘాల చైర్మెన్, వైస్ చైర్మన్లు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.