Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి
- ప్రతీ డివిజన్‌కు రూ.50లక్షల మంజూరు కోసం కౌన్సిల్ ఆమోదం..
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ పోచమ్మ మైదాన్
వరంగల్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దటానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన సమావేశ మందిరంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన తొలి సర్వసబ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎంపీ పసునూరి దయా కర్, ఇన్చార్జి కమిషనర్, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా మేయర్‌తో పాటు నూతన కార్పొరేటర్లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. వరంగల్‌ను ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుటకు సీఎం కృషి చేస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన 33అంతస్తులతో నిర్మించే ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివద్ధి చేయడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. జులై 1 నుంచి పది రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగర అభివృద్ధికి నెలకు రూ.లు 7.35కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. మే నెల వరకు రూ.లు 111 కోట్లు మంజూరుకాగా 106.6కోట్లతో వివిధ అభివద్ధి పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. ఏడో విడతలో 13 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉందని పేర్కొన్నారు. వరంగల్ నగరాన్ని ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దుటకు కార్పొరేటర్లందరూ ప్రత్యేక చొరవ తీసుకుని స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్పొరేటర్లు కీలకంగా పనిచేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతీ డివిజన్లకు 50 లక్షల రూపాయల మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశలో పాలకవర్గం నిర్ణయాలు తీసుకునేలా ముందుకు సాగాలన్నారు.
పట్టణ అబివృద్ధే ధ్యేయం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా డివిజన్ అభివద్ధికి కషి చేయాలన్నారు.. గతంలో నాలాల విస్తరణకు కషి చేశామన్నారు. డ్రైనేజీ, రోడ్లు అభివద్ధి పనులకు కొన్ని టెండర్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఖిలా వరంగల్ అభివద్ధికి 5కోట్ల రూపాయలు మంజూరు కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివద్ధి చేయాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. లక్ష్మీపురంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, రంగశాయిపేటలో రెండున్నర ఎకరాలలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
నియామకాలు భర్తీ చేయాలి .
పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్లో అధికారుల కొరత ఉందన్నారు. పనులు సక్రమంగా సాగట్లేదని, అందువల్ల అధికారుల నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు.
కార్పొరేటర్లు కలిసికట్టుగా ఉండాలి .
నగర అభివద్ధికి కార్పొరేటర్లు అందరూ కలసికట్టుగా పని చేయాలని తూరు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. హరితహారం, పట్టణ ప్రగతిలను విజయవంతం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగిన చొరవ తీసుకోవాలన్నారు.
కార్పొరేటర్లు సహకరించాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ ఒకరికొకరు సహకరించి పనులు చేసుకోవాలన్నారు.
ఎంపీ దయాకర్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు కలిసికట్టుగా పనిచేయాలన్నారు . క్రమశిక్షణతో ప్రజలకు అందుబాటులో ఉండి డివిజన్ అభివద్ధికి కషి చేస్తే రాజకీయ ల్లో రాణిస్తారనని తెలిపారు.
33%అడవులు పెంచడం కోసం హరితహారం
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33శాతం అడవులు పెంచెందుకూ హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి డివిజన్‌కు ఒక నర్సరీ ఉండేలా కషి చేయాలన్నారు. దళిత ఎంఫోర్స్మెంటు స్కీమును అర్హులైన వారికి అందించాలాన్నారు.
22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి తన డివిజన్‌కు సానిటేషన్ సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించాలన్నారు. కార్పొరేటర్లు మరుపల్లి రవి, చాడ స్వాతి చింతాకుల అనిల్‌లు మాట్లాడుతూ.. పైపులైన్లు లీకేజీ వల్ల తాగునీరు కలుషితం అవుతున్నట్టు తెలిపారు. సీసీ రోడ్లను తవ్వి మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇవ్వడంతో అంతర్గత రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. డివిజన్లో విరిగిన స్తంభాలను తొలగించాలని, ఇండ్లపై వున్న కరెంటు తీగలను తొలగించాలని, అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేని వారు తెలిపారు. .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో పాటించని నిబంధనలు
సెెకండ్ వేవ్ కరోనాతో అనేక మంది బలి అయినప్పటికీ మంగళవారం నిర్వహించిన, సర్వసభ్య సమావేశంలో కోవిడు నియమాలు పాటించలేదు. భౌతిక దూరం పాటించకుండా సీట్లను అరేంజ్ చేశారు. సమావేశ మందిరంలో 66 మంది కార్పొరేటర్లు, అధికారులుతో పాటు మరికొంత మంది డివిజన్ నాయకులు సైతం రావడం వలన పూర్తిగా సమావేశ మందిరం తకిక్కిరిసిపోయింది .