Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఏ రవీందర్
నవతెలంగాణ-శాయంపేట
ఫర్టిలైజర్షాప్ డీలర్లు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, లేనియెడల షాపు లైసెన్స్ రద్దు చేస్తామని పరకాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు వంగ రవీందర్ హెచ్చరించారు. ప్రగతి సింగారంలోని రైతు వేదిక భవనంలో ఏఓ గంగా జమునా అధ్యక్షతన మంగళవారం 'ఎరువులు, పురుగుమందులు, విత్తనాల నిర్వహణలో పాటించవలసిన నాణ్యత ప్రమాణాల'పై డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి డీలరు రైతులకు కొనుగోలు చేసిన వాటికి కచ్చితంగా రసీదు ఇవ్వాలన్నారు. ధరల పట్టిక బోర్డు ప్రతి షాప్ ముందు రైతులకు కనపడేలా పెట్టాలని, నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మవద్దని హెచ్చరించారు. ఈ పాస్ ద్వారా రైతులకు అమ్మకాలు జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు అహ్మద్ రజా , రాకేష్ , శివ కుమార్, స్టెల్లా, ఎరువులు పురుగుమందుల డీలర్లు పాల్గొన్నారు.