Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవాలి: ఎంపీడీఓ
- పలు అంశాలపై మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చ..
నవతెలంగాణ-నర్సంపేట
మిషన్ భగీరథ మంచినీటిని సరఫరా అస్తవ్యస్తంగా మారిందని. ఈ నీటిని పగటి పూట మాత్రమే సరఫరా చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీపీ మోతె కలమ్మ అధ్యక్షతన నిర్వహించిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు ఏజెండా అంశాలపై చర్చసాగింది. మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా వేలపాలలేకుండా సాగడం వల్ల ఇబ్బందులు ఎదురైతున్నాయని లక్నెపెల్లి, రామవరం సర్పంచ్లు గొడిశాల రాంబాబు, కొడారి రవి సమావేశంలో ప్రస్తావించారు. మిషన్ భగీరథ ఇంజనీరు అధికారులు బాధ్యతరహితంగా విధులను నిర్వర్తిస్తున్నారంటూ పలువురు సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల తాము ప్రజల్లో పలుచపడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. దీనిపై మిషన్ భగీరథ ఏఈ సతీష్ సమాధానం చెబుతూ దుగ్గొండి మండలానికి నీటిని పంపింగ్ చేయడానికి రాత్రి వేలల్లో సరఫరా చేయాల్సి వస్తుందని ఇకపై నిర్ణీత సమయాన్ని కేటాయించి పగటి వేలల్లో నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పరిశ్రమల శాఖ ద్వారా కేటాయించిన సంక్షేమ పథకాలకు అర్హులైన వారిచే ధరఖాస్తులు చేసుకొనేందుకు ప్రజాప్రతినిధులు యువకుల్లో అవగాహన కల్పించాలని ఎంపీడీవో ఏ.నాగేశ్వరావు కోరారు. రూ.5లక్షల విలువజేయనున్న యూనిట్లు ఉన్నాయని ఎస్సీ, ఎస్టీలకు 50శాతం, ఇతరులకు రూ.25శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. దీనిపై రామవరం సర్పంచ్ కొడారి రవి మాట్లాడుతూ ఇంతకు ముందు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకొన్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంపీడీవో స్పందిస్తూ టీఎస్ఈపాస్ వెబ్ ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని కొత్త వారితో పాటు ఇంతకు ముందు ధరఖాస్తు చేసిన వారికి కూడా ప్రాధన్యనిస్తామని చెప్పారు. ఈ రెవిన్యూ, పౌరఫరఫరా అంశంపై తహసిల్దార్ వీ.రాంమూర్తి మాట్లాడారు. పార్టు బీ పరిధిలోని భూముల రైతులకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని, ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామం నుంచి పట్టణం వరకు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తున్న భూములను సర్వే చేస్తున్నామని, ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను సర్వే చేస్తున్నామని, త్వరలో అన్నీ గ్రామల్లోని భూములను రికార్డులోకి తీసుకొస్తామన్నారు. వేలు ముద్రలు, ఐరీష్ పడని వారు, సెల్ ఫోన్లు లేని వృద్ధులకు బియ్యం ఇవ్వడం లేదని, ఈ సమస్యతో ఊరికి 5 నుంచి 10 మంది నష్టపోతున్నారని సర్పంచ్, ఎంపీటీసీలు తెలిపారు. పరిష్కారం దొరికే వరకు థర్డు పార్టీ అథె¸ంటింగ్తోనైనా బియ్యం పంపిణీ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యనను పరిష్కారిస్తామని తహసిల్దార్ తెలిపారు. ఆ తర్వాత వైద్యారోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరు, పశుసంవర్థక, ఈజీఎస్ వంటి అంశాలపై చర్చసాగింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కోమండ్ల జయమ్మ, వివధ శాఖల అధికారులు, ఎంపీటీసీ, సర్పంచ్లు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయండి
జూలై 1 నుంచి నిర్వహించే నాలుగోవిడుత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని ఎంపీడీవో ఏ.నాగేశ్వరావు కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులను ఉద్ధేశించి మాట్లాడుతూ మొక్కల పెంపకం, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. పల్లెప్రగతి పురోగతిని సాధించడానికి సర్పంచ్, ఎంపీటీసీలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. క్లోరినేషన్ విధిగా క్రమం తప్పకుండా చేయాలని, మిషన్ భగీరథ నీటి సరఫరాలో అడ్డంకులను తొలగించేందుకు పరిష్కారం చూపాలని, పల్లెలు పకృతి వనాలతో పచ్చగా తీర్చిదిద్దబడాలని, పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రతగా ఉండేలా ప్రజలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు.