Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
పట్టణ ప్రగతి పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో గతేడాది తీసుకున్న పలు పనులు నేటికీ పూర్తి కాలేదు. గ్రేటర్ వరంగల్ నగరంలో 413 పనులకు రూ.109.36 కోట్లు మంజూరు చేశారు. ఇందులో పలు పనులు నేటికీ పూర్తి కాలేదు. రేపటి (జూలై 1) నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గతేడాది చేపట్టిన పనులు నేటికీ పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైకుంఠధామాల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రేటర్ వరంగల్‌లో 8 ప్రాంతాల్లో గత పట్టణ ప్రగతి కార్యక్రమంలో రూ.799 లక్షలతో వైకుంఠధామాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో రెండు ప్రాంతాల్లో మాత్రమే నిర్మాణం పూర్తయ్యింది. మూడు ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉండగా, మరో మూడు చోట్లా టెండర్ల దశలోనే ఉండడం గమనార్హం. గతేడాది చేపట్టిన సమీకృత మార్కెట్ల నిర్మాణాల టెండర్లు ఖరారు కాలేదు. దీంతో రూ.42 లక్షలతో మూడు ప్రాంతాల్లో తలపెట్టిన సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
గ్రేటర్ వరంగల్ నగరంలో గతేడాద పట్టణ ప్రగతి కింద చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. గతేడాది 8 ప్రాంతాల్లో వైకుంఠధామం నిర్మాణ పనులు చేపట్టగా రూ.799 లక్షలు మంజూరు చేశారు. ఏడాది గడిచినా పలు పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. ఒక ప్రాంతంలో టెండర్ పిలిచినా ఎవరూ పాల్గొనకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కేవలం 2 ప్రాంతాల్లో మాత్రమే వైకుంఠధామాల నిర్మాణం పూర్తైంది. మూడు ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో టెండర్ దశలోనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి కాకముందే రేపటి నుంచి పదో తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
టెండర్ దశలోనే..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 8 వైకుంఠధామాల్లో 3 టెండర్ దశలోనే ఉండడం గమనార్హం. దేశాయిపేటలో రూ.30 లక్షలతో తలపెట్టిన వైకుంఠధామం పనులు, మడికొండలోని 46వ డివిజన్లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఎస్సీ శ్మశాన వాటికకు సంబంధించి టెండర్లు పిలిచినా ఎవరూ పాల్గొనకపోవడంతో ఇప్పటికీ టెండర్ ఖరారు కాలేదు. మడికొండలోని 46వ డివిజన్లో రూ.30 లక్షలతో నిర్మించ తలపెట్టిన హిందు శ్మశాన వాటిక అభివృద్ధి పనులు టెండర్ దశలోనే ఉన్నాయి.
రెండిటి పనులు పూర్తి..
వరంగల్ పోతననగర్ శ్మశాన వాటికలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేశారు. హన్మకొండ పద్మాక్ష్మీ శివముక్తి ధామం శ్మశాన వాటికలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
రూ.కోటితో ఎలక్ట్రిక్ శ్మశాన వాటిక
వరంగల్ పోతన శ్మశాన వాటికలో రూ.21 లక్షల వ్యయంతో రెండు ఎల్పీజీ శ్మశాన వాటికలను కోవిడ్ మృతుల ఖననం కోసం ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా రూ.కోటితో ఎలక్ట్రిక్ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచారు. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.
సమీకృత మార్కెట్లు
పట్టణ ప్రగతిలో భాగంగా గతేడాది రూ.42 లక్షల అంచనా వ్యయంతో 3 మార్కెట్లను చేపట్టారు. టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. హన్మకొండ ఐబీ గెస్ట్‌హౌజ్ ప్రాంతంలో తలపెట్టిన మార్కెట్‌కు మాత్రమే టెండర్ ఖరారైంది. మిగతా రెండు మార్కెట్లకు నేటికీ టెండర్లు ఖరారు కాలేదు. మూడు చోట్లా పట్టణ 3 సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌ను 4.16 ఎకరాల్లో సమీకృత మార్కెట్‌ను నిర్మించడానికి రూ.24 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. టెండర్లను పిలిచినా, ఇంకా ఖరారు కాలేదు.