Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన ఆర్ఎంపీ కుటుంబాలను గురువారం ఆర్ఎంపీ, పీఎంపీల మండల వెల్ఫేర్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు గోపు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా లింగాల గ్రామానికి చెందిన ఆర్ఎంపి సాంబమూర్తి కుటుంబాన్నికి రూ.లు 5వేలు, దుంపిలపల్లి గ్రామానికి చెందిన లింగస్వామి కుటుంబానికి 2వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
అలాగే దుంపీల పల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సంతోష్ తండ్రి, జగ్గయ్య పేట గ్రామానికి చెందిన లింగమూర్తి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్ నారాయణ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ మండల కార్యదర్శి శ్రీధర్ ఉపాధ్యక్షులు అశోక్ సహాయ కార్యదర్శి కుమార్ ప్రచార కార్యదర్శి శ్యామ్ కోశాధికారి శంకర్ , సంతోష్ రెడ్డి, మురళి ,షబ్బీర్ రవీందర్ ,హరి ప్రసాద్ పాల్గొన్నారు.