Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొప్ప కమ్యూనిస్టు వాది మంతెన
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నాగయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలంలోని ఇప్పగూడెం గ్రామ సర్పంచ్, సీపీఐ(ఎం) నేత మంతెన అజరురెడ్డి భౌతిక కాయానికి గురువారం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ... తన తండ్రి అమరజీవి మంతెన నారాయణ రెడ్డి ఆశయాలను పునికి పుచ్చుకుని పార్టీకి, గ్రామ అభివృద్ధి కోసం పరితపించిన గొప్ప కమ్యూనిస్టు వాది అని కొనియాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం మాట్లాడుతూ రాజకీయాలతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న అజరు రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని అన్నా రు. నేడు జరిగే అజరురెడ్డి అంతిమ యాత్ర లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యకాస ఆలిండియా కార్యదర్శి బి. వెంకట్, ఇతర నాయుకులు అధిక సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యు లు ఎండి అబ్బాస్, బత్తు ల హైమావతి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జి ప్రభాకర్‌రెడ్డి, సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, సాంబరాజు, గట్ల కొండల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దాసరి కళావతి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఆశాలత, శ్రీకాంత్, యూ. రవి, సిద్ధారెడ్డి, భాస్కర్, మండల కన్వీనర్ మునిగెల రమేష్, గట్ల మల్లారెడ్డి, కోడెపాక యాకయ్య, పిట్టల నరేందర్, పొలసు కిష్టయ్య, ఐలయ్య, రాజు,సోమన్న, శ్రీను, రామచంద్రు, మహేందర్, సతీష్, యాదగిరి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.