Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పల్లెప్రగతి పనులు శాశ్వతంగా, పటిష్టంగా ఉండేలా బాధ్యతగా చేపట్టాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. తొలుత వైద్యుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా నాయకులు రంగు హరీష్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మండలంలోని ఛాగల్, రాఘవాపూర్, మీది కొండ, కొత్తపల్లి, ఘన్ పూర్, తాటికొండ గ్రామాల్లో పది రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి పనులను ప్రారంభించారు. సర్పంచులు తాటికొండ సురేష్, పోగుల సారంగపాణి, కందుల శ్రీలత శ్రీనివాస్, నాగరబోయిన మణెమ్మ యాదగిరి, గోవిందు ఆనందం, చల్లా ఉమా సుధీర్ రెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెలను సుందరంగా తీర్చిదేద్దేందుకు సీఎం కేసీఆర్ మహత్తరమైన ప్రణాళిక తో ముందుకు సాగుతున్నదని అన్నారు. దళిత ఆత్మగౌరవమే కేసీఆర్ లక్ష్యమని, రాబోయే కాలంలో దళితుల ఆత్మ గౌరవమే ధ్యేయంగా నియోజకవర్గ పరిధి వందమంది లబ్ధిదారులకు పైసా ఖర్చులేకుండా పది లక్షలు అందించే పథకం అమలు లో భాగంగా రూ.1200 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేయనున్నట్లు చెప్పారు.