Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
పల్లెల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్టు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నూతక్కి పద్మ నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణాలకు ధీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చాన్నారు. ఫ్రైడే డ్రైడే అలవాటుగా మార్చుకోవాలన్నారు. కురవి ఎంపీపీ గుగులోత్ పద్మావతి-రవినాయక్, మహబూబాబాద్ జిల్లా మార్కెట్ చైర్మెన్ బజ్జురి ఉమపిచ్చిరెడ్డి, ఎంపీడీఓ ధన్సింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట లాలయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు గుగులోతు రవినాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పి ఏ సీ ఎస్ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సయ్య ,ఎంపీటీసీ భోజ్యనాయక్, శ్రీ వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్, నాయకులు బాధావత్ రాము నాయక్ పాల్గొన్నారు .